🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

వినాయక నిమజ్జన ఏర్పాట్లపై పరకాల ఆర్డీఓ సమీక్ష

Main Image Additional Image
ముఖ్యమైనవి:మండపాల నిర్వహణ నిమజ్జన ఏర్పాట్లు పై చర్చఅన్ని శాఖల అధికారుల సమిష్టితో గణనాథుడి పండుగను విజయవంతం చేద్దాం ఆర్డిఓ వెంకన్న ఏసిపి సతీష్ బాబు




పరకాల సెప్టెంబర్ 9 (అక్షయ వెబ్ న్యూస్) :పరకాల రెవెన్యూ డివిజన్ పరిధిలో వినాయక నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై పరకాల రెవెన్యూ డివిజనల్ అధికారి డి.ఎస్. వెంకన్న సంబంధిత అధికారులతో పరకాల ఆర్డీవో కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పరకాల ఆర్డీఓ కార్యాలయంలో డివిజన్ పరిధిలోని ఏసిపి సతీష్ బాబు తహసీల్దార్లు, పోలీస్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు వినాయక మండపాలు, నిమజ్జన ప్రాంతాలు, ఊరేగింపు మార్గాలు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు.వినాయక
నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జన ప్రాంతాల్లో భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు, విద్యుత్‌ భద్రత, పారిశుధ్యం, తాగునీటి సదుపాయాలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ప్రజలు మరియు వినాయక ఉత్సవ నిర్వాహకులు పోలీస్ మరియు రెవెన్యూ అధికారులకు సహకరిస్తూ, శాంతియుత వాతావరణంలో వినాయక నిమజ్జన వేడుకలను నిర్వహించాలని ఆర్డీఓ కోరారు.
ఈ కార్యక్రమంలో పరకాల డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
🏠 Home