🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

ఐకమత్యంతో పరకాల ప్రెస్ క్లబ్ పై టి యు డబ్ల్యూ జే ఐజేయు జెండా ఎగర వేద్దాం

Main Image Additional Image
ఐకమత్యంతో పరకాల ప్రెస్ క్లబ్ పై టి యు డబ్ల్యూ జే ఐజేయు జెండా ఎగర వేద్దాం



పరకాల పట్టణ కేంద్రంలో యూనియన్ డివిజన్ స్థాయి నాయకుల సమీక్ష


అనంతరం డివిజన్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక

టి యు డబ్ల్యూ జే ఐజేయు పరకాల డివిజన్ అధ్యక్షుడిగా కత్తి రాజు






పరకాల సెప్టెంబర్ 10 (అక్షయ న్యూస్) : పరకాల పట్టణ కేంద్రంలోని రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పరకాల డివిజన్ స్థాయి నాయకుల సమీక్ష సమావేశం రాష్ట్ర నాయకులు భోజ శ్రీనివాస్ రెడ్డి జిల్లా నాయకులు సునేందర్ గడ్డం బాలరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఐజేయు యూనియన్ అధ్యక్షులు గడ్డం కేశవమూర్తి ప్రధాన కార్యదర్శి సాయిరాం రాష్ట్ర ఉపాధ్యక్షులు గాడేపల్లి మధు రాష్ట్ర హౌసింగ్ సొసైటీ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ వల్లాల వెంకట రమణ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ తోట సుధాకర్ యూనియన్ కోశాధికారి విష్ణువర్ధన్ గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ కోశాధికారి అమర్ జిల్లా సీనియర్ నాయకులు మెండు రవీందర్ నరసింహ రాములు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరకాల ప్రెస్ క్లబ్ పై ఐజెయు జెండా ఎగరవేసేందుకు యూనియన్ నాయకులు అందరూ సన్నదం కావాలి అని అన్నారు అనంతరం తెలంగాణ స్టేట్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పరకాల డివిజన్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది పరకాల డివిజన్ అధ్యక్షులుగా సాక్షి టీవీ రిపోర్టర్ కత్తి రాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ప్రధాన కార్యదర్శిగా సొల్లేటి సునేందర్, కోశాధికారిగా అంకారపు ఐలయ్య, ఉపాధ్యక్షులుగా దార్నా వేణు, చొక్కారావు, చిరంజీవి, దూలం శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శిలుగా సతీష్ కుమార్, శ్రీనివాస్, రమేష్ చంద్ర, నయీం పాషా,
కార్యవర్గ సభ్యులు. కార్తీక్, రాజేందర్, రమేష్, శ్రీకాంత్, శ్రీనాథ్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అనంతరం నూతన అధ్యక్ష కార్యదర్శులకు రాష్ట్ర జిల్లా నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు యూనియన్ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని యూనియన్ నిబంధనలకు వ్యతిరేకంగా అవలంబిస్తే వారిపై జిల్లా యూనియన్ నాయకులు చట్టరీత్యా చర్యలు తీసుకుంటారని తెలియజేశారు
🏠 Home