చలో హైదరాబాద్ వాయిదా పై ఉద్యోగులు పెన్షనర్లు తీవ్ర అసంతృప్తి
హనుమకొండ సెప్టెంబర్ 11 (అక్షయ న్యూస్) :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల జేఏసీ ఈ నెల 10 న తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమం వాయిదా వేయడంతో ఉద్యోగులు పెన్షనర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ పెన్షనర్ల అసోసియేషన్ హనుమకొండ జిల్లా అద్యక్షుడు కుందూరు గోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ హనుమకొండ జిల్లా కార్యాలయంలో అందుబాటులో ఉన్న సబ్యులతో ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశం కావడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి జేఏసీ తో కుదుర్చుకున్న ఒప్పందం కాలయాపన చేయడానికే నని గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా ఉద్యోగులను కుట్ర పూరితంగా మోసం చేస్తోందని అన్నారు.
రాష్ట్ర జేఏసీ నేతలు ప్రబుత్వ కార్యదర్శి తో చేసుకున్న ఒప్పందం పై చర్చించడానికి గాను రాంనగర్ లోని జిల్లా కార్యాలయం ఆవరణలో 15.09.2026 రోజు ఉదయం 11 గంటలకు జిల్లా స్థాయి విస్తృత సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది అని ఈ సమావేశానికి హనుమకొండ జిల్లా జేఏసీ నాయకులు ఉమ్మడి వరంగల్ జిల్లా సోదర సంఘాల ప్రతినిధులు మరియు పెన్షనర్లను ఆహ్వానించి వారి సలహాలు సూచనల మేరకు తదుపరి కార్యాచరణ నిర్ణయించడం జరుగుతుందని తెలిపారు
ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి పిండి కుమారస్వామి కోశాధికారి పుల్లూరు విద్యాసాగర్ , ఉపాధ్యక్షుడు నారాయణ రావు, కార్యవర్గ సభ్యులు యన్ సమ్మయ్య, యం వెంకట్ రెడ్డి, కె జగదీశ్వర్ రెడ్డి , శ్రీరాములు , ఏ సారయ్య పెద్ది ఆంజనేయులు, తాటికొండ సుదాకర్ గట్టు ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.