🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

గ్రీన్‌ఫీల్డ్ హైవే విషయంలో పరకాల ప్రజలను మరోసారి మోసం చేయొద్దు..!

Main Image



గతంలోనే భూసేకరణ పూర్తి చేసిన ఇన్‌,ఔట్‌ పాయింట్లను ఎమ్మెల్సీ పోచంపల్లి మార్చే ప్రయత్నం ఎందుకు..?

గత ప్రభుత్వం పరకాలను అభివృద్ధి చేసింది ఏమీ లేదు.. అప్పుడు లేనిది ఇప్పుడు ముసలి కన్నీరెందుకో.. !


పరకాల, సెప్టెంబర్ 12 (అక్షయ న్యూస్) :
గ్రీన్‌ఫీల్డ్ హైవే ఇన్‌, ఔట్‌ పాయింట్ల విషయంలో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సభలో చేసిన వ్యాఖ్యలు పరకాల ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని బీజేపీ పరకాల పట్టణ శాఖ అధ్యక్షులు
గాజుల నిరంజన్ విమర్శించారు. ఈ సందర్భంగా నిరంజన్ మాట్లాడుతూ గ్రీన్‌ఫీల్డ్ హైవే
పరకాల పట్టణానికి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో హుజూరాబాద్ రోడ్డులో ఇన్‌, ఔట్‌ పాయింట్ లను ఏర్పాటు చేయడానికి గతంలోనే ప్రభుత్వం, గ్రీన్‌ఫీల్డ్ హైవే సిబ్బంది నిర్ణయించారు. అందుకు సంబంధించి భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించి, సుమారు 360 అడుగుల వెడల్పుతో భూసేకరణ కూడా జరిగింది.

ఇప్పటికే భూసేకరణ జరిగిన ఇన్ ఔట్ పాయింట్‌ను మార్చడం వెనుక అంతర్యం ఏమిటి..?

పరకాల పట్టణానికి అత్యంత సమీపంలో ఉండి ప్రజలకు, వ్యాపారులకు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్న గ్రీన్‌ఫీల్డ్ హైవే ఇన్‌ పాయింట్, ఔట్‌ పాయింట్ రోడ్డును మలకపేట రోడ్డుకు మార్చాలని ఎమ్మెల్సీ
పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడటం వెనుక ఉన్న అంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని గాజుల నిరంజన్ అన్నారు.గతంలోనే భూసేకరణ చేసి, భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించిన ప్రాంతాన్ని పక్కనపెట్టి, ఇప్పుడు కొత్తగా మలకపేట రోడ్డుకు మార్చాలని మాట్లాడటం పరకాల ప్రజలకు తీవ్ర అన్యాయం చేయడమేనని ఆయన అన్నారు.

పరకాలకు గతంలో అన్యాయం చేసింది ఎవరు..?

గతంలో అధికారంలో ఉన్న మీ ప్రభుత్వ హయాంలోనే పరకాలకు తీవ్ర అన్యాయం జరిగింది. చారిత్రక నేపథ్యం, ప్రజల ఆకాంక్షలు ఉన్నప్పటికీ పరకాలను జిల్లాగా ఏర్పాటు చేయకుండా భూపాలపల్లి జిల్లాను ఏర్పాటు చేసి పరకాల ప్రజల ఆశలను దెబ్బతీసిన నేతలు, ఈరోజు పరకాల అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.అప్పుడు పరకాల ప్రజల ఆకాంక్షలు ఎందుకు పట్టించుకోలేదు? పరకాల
జిల్లా కోసం ప్రజలు చేసిన పోరాటాలను ఎందుకు గౌరవించలేదు? ఇప్పుడు పరకాలపై ప్రేమ ఒలక
బోస్తూ సభల్లో ప్రకటనలు చేయడం వెనుక రాజకీయ ప్రయోజనం తప్ప మరేమైనా ఉందా? అని గాజుల నిరంజన్ ప్రశ్నించారు.పరకాల ప్రజలు ఇక మోసపోరుపరకాల పట్టణానికి కిలోమీటర్ దూరంలో ఇప్పటికే భూసేకరణ జరిగిన గ్రీన్‌ఫీల్డ్ హైవే పాయింట్లను మార్చే ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని, పరకాల ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్న ప్రస్తుత ఇన్‌ పాయింట్, ఔట్‌ పాయింట్ పాయింట్లపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

🏠 Home