🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

పరకాల అరుణ ఫర్టిలైజర్స్ నందు రైతులకు ఉచిత ఎరువుల బుకింగ్ సేవలు.

Main Image



ఆధార్, మొబైల్ ఫోన్‌తో అరుణ ఫర్టిలైజర్స్‌లో బుకింగ్ సౌకర్యం



పరకాల: రైతు సోదరులు, సోదరీమణులకు ఎరువుల బుకింగ్ ప్రక్రియను సులభతరం చేసేందుకు పరకాలలోని అరుణ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ఆధ్వర్యంలో ఉచితంగా ఎరువుల బుకింగ్ సేవలను అందిస్తున్నట్లు సంస్థ ప్రొప్రైటర్ తెలిపారు.కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రస్తుతం ఎరువుల పంపిణీ ప్రక్రియ సెంట్రల్ యాప్ ద్వారా జరుగుతోందని పేర్కొన్నారు. ఈ విధానంపై అవగాహన లేని రైతులకు తమ షాప్‌లో ఎటువంటి రుసుము లేకుండా బుకింగ్ చేసి సహకరిస్తామని తెలిపారు.రైతులు తమ ఆధార్ కార్డు, పట్టా పాస్‌బుక్, సర్వే నంబర్లు, మొబైల్ ఫోన్ వివరాలతో షాప్‌ను సంప్రదిస్తే బుకింగ్ ప్రక్రియలో సహాయం అందిస్తామని తెలిపారుబుకింగ్ అనంతరం లభించే క్యూ ఆర్ కోడ్ టోకెన్‌ను షాప్‌లోని పి ఓ ఎస్ మెషిన్ ద్వారా స్కాన్ చేసి ఎరువులు పొందే అవకాశం ఉంటుందని వివరించారు.


స్నేహ శీలుడు అనునిత్యం రైతు సేవకుడు గందె వెంకన్న


అన్నదాతలకు అండగా నిలుస్తూ రైతన్నకు నేనున్నానని భరోసాను కల్పిస్తూ పరకాల పట్టణ కేంద్రంలో అరుణ ఫర్టిలైజర్స్‌లో రైతులకు అవసరమైన నాణ్య మైన వివిధ రకాల ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందుబాటులో ఉంచుతూ వారికి సరసమైన రేటుకు అందజేయడమే లక్ష్యంగా ఎంచుకున్నాడని పలువురు అన్నదాతలు కొనియాడుతున్నారు రైతన్నకు సేవలు అందించడమే ఆయన ఏకైక లక్ష్యంగా ఉన్నాడని అతని సేవలు అందుకున్న రైతన్న నోటా స్నేహ శీలుడు అనే మాటలు వినబడుతున్నాయి. ముఖ్యంగా యూరియా, పొటాషియం, డీఏపీ, సూపర్ 20:20 తదితర ఎరువులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం బుకింగ్ చేసుకునేందుకు రైతులకు పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు.రైతులు
ఈ ఉచిత బుకింగ్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అరుణ ఫర్టిలైజర్స్ ప్రొప్రైటర్ గందె వెంకన్న కోరారు.


మరింత సమాచారం, బుకింగ్ సహాయం కోసం 9848293039, 9951666731 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
🏠 Home