గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మడికొండ సంపత్ కుమార్.
ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆ దేవుడిని వేడుకున్న
పరకాల సెప్టెంబర్ 16 (అక్షయ న్యూస్) :
పరకాల పట్టణంలోని ఫైర్ స్టేషన్ ఎదురుగా స్టార్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుడి పూజ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు మడికొండ. సంపత్ కుమార్. పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు వినాయకుడి కృపతో ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు వెళ్లి విరియాలని, రైతుల పంట పొలాలు పచ్చగా కళకళలాడాలని ప్రతి కుటుంబము ఆనందంగా ఉండాలని, పరకాల పట్టణంలోని ప్రతి కుటుంబానికి మడికొండ సంపత్ కుమార్ ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపినారు. ప్రజలందరూ వినాయక నవరాత్రి ఉత్సవాలను ఐకమత్యంతో, భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని కోరినారు. పండుగలు ప్రజలను కలిపే వేదికలుగా మారాలని ఆకాంక్షించినారు. పండుగలో సంబరం ఉండాలి, సమాజంలో సోదర భావం మరింత బలపడాలి, స్నేహభావం మరింత పెంపొందాలని కోరినారు. గత 15 సంవత్సరముల నుండి మట్టి వినాయక విగ్రహాలనే ఏర్పాటు చేస్తున్న స్టార్ యూత్ అసోసియేషన్ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు రాము అయ్యగారు, అశోక్ గారు, స్టార్ యూత్ ఎర్ర. సత్యనారాయణ, వలపిరెడ్డి ప్రశాంత్, ప్రవీణ్ ,వివేక్, వినయ్, చిన్నాల సాయి చరణ్, సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు.