🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన పరకాల ఆర్డీఓ వెంకన్న

Main Image
గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన పరకాల ఆర్డీఓ వెంకన్న

పరకాల సెప్టెంబర్ 18 (అక్షయ న్యూస్) :
పరకాల పట్టణంలోని చలివాగు ప్రాంతంలో జరుగుతున్న గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరకాల రెవెన్యూ డివిజనల్ అధికారి పరిశీలించి, సంబంధిత అధికారులకు తగు సూచనలు చేశారు. నిమజ్జన కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు, భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ పరిశీలనలో పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్, పరకాల మున్సిపల్ కమిషనర్ పవన్ కుమార్, స్థానిక తహసీల్దార్ టి. విజయలక్ష్మి సిఐ ప్రవీణ్ కుమార్, పోలీస్ సిబ్బంది సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
🏠 Home