🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

నాగారం లో మేఘమణి ఐకానిక్ ఫీల్డ్ డే కార్యక్రమం

Main Image


నాగారం లో మేఘమణి ఐకానిక్ ఫీల్డ్ డే కార్యక్రమం


పరకాల, సెప్టెంబర్ 18 అక్షయ న్యూస్: నాగారం గ్రామంలో మేఘమణి కంపెనీకి చెందిన ఐకానిక్ పురుగుమందుపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఫీల్డ్ డే కార్యక్రమాన్ని వరంగల్ టెరిటరీ మేనేజర్ కొత్త జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మేఘమణి సంస్థ హెచ్.ఓ. ఏ ఎం ఎం రితికా చావ్లా మరియు రీజినల్ మేనేజర్ దయాసాగర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఐకానిక్ ఐకానిక్ వినియోగించిన రైతు కానుగుల సదానందం తన అనుభవాలను వివరిస్తూ మాట్లాడుతూ, వారం రోజుల క్రితం పరకాలలోని నవత అండ్ బ్రదర్స్ షాపులో 500 మి.లీ. ఐకానిక్ కొనుగోలు చేసి నా పత్తి పంటకు పిచికారీ చేశాను. పిచికారీకి ముందు ప్రత్తి పంటలో తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, తామర పురుగు నల్లి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. పిచికారీ చేసిన నాలుగు రోజుల తర్వాత ఈ సమస్యలు గణనీయంగా తగ్గాయని, ఆకులు ఆరోగ్యంగా కనిపించి మొక్కలు బలంగా పెరుగుతున్నట్లు గమనించాను” అని తెలిపారు.ఐకానిక్ మందు పై తన సంతృప్తిని వ్యక్తం చేసిన సదానందం, తన అనుభవాన్ని కార్యక్రమంలో పాల్గొన్న ఇతర రైతులతో పంచుకున్నారు.ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ శ్రీ దయాసాగర్ మరియు ఏ.ఎం.ఎం. రితికా చావ్లా మాట్లాడుతూ, మేఘమని కంపెనీ విస్తృతమైన ఉత్పత్తుల శ్రేణిని కలిగి ఉందని తెలిపారు. ఐకానిక్ ను మేఘమని పేటెంట్ ప్రొడక్ట్‌గా పరిచయం చేస్తూ, పత్తి పంటలో తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, తామర పురుగు వంటి రసాన్ని పీల్చే పురుగుల సమస్యల నియంత్రణకు ఉపయోగపడుతుందని వివరించారు. ఎకరానికి 150 మి.లీ. మోతాదులో ఉపయోగించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట టెరిటరీ మేనేజర్ లక్ష్మీనారాయణ, రైతులు కునాటి విజయభాస్కర్ రెడ్డి, మొగిలి డా సురేష్ తో పాటు నాగారం మరియు పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

🏠 Home