ఎమ్మెల్సీ పోచంపల్లి స్వగ్రామం లో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..
ఎమ్మెల్సీ పోచంపల్లి స్వగ్రామం లో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..
కాంగ్రెస్‌లో చేరిన వరికోల్ గ్రామ బీఆర్‌ఎస్ నాయకులు
హనుమకొండ సెప్టెంబర్ 20 (జనం సాక్షి) :
హనుమకొండ భవానీనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం యందు నడికూడ మండలం వరికోల్ గ్రామానికి చెందిన 50 మంది బీఆర్‌ఎస్ నాయకులు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు
.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసం క్రమంగా పెరుగుతోందని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుంచి స్పందన లభిస్తోందని అన్నారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వ పాలకులు అభివృద్ధి పేరుతో దోచుకున్నారని, ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం,అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ పాలన సాగిస్తోందని తెలిపారువరికోల్ గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం, ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నడికుడ మండల పార్టీ అధ్యక్షులు మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు తదితరులు పాల్గొన్నారు