🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

పరకాల ఆదర్శనగర్ గణనాథునికి 51 రకాల నైవేద్యాలు.

Main Image Additional Image
పరకాల ఆదర్శనగర్ గణనాథునికి 51 రకాల నైవేద్యాలు.

పరకాల సెప్టెంబర్ 21 (అక్షయ న్యూస్) :

పరకాల పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీలో గణనాథుడు భక్తుల నుండి విశేష పూజలు అందుకుంటున్నాడు. ఆదర్శనగర్ గణేష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా సోమవారం రోజున గణనాధునికి 51 రకాల నైవేద్యాలను భక్తులు సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఆధ్యాత్మిక, సాంస్కృతి కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
🏠 Home