వినయ్‌భాస్కర్‌కు వెంటనే క్షమాపణ చెప్పాలి
ముఖ్యమైన పాయింట్స్:ఎంజీఎం సందర్శనలో అడ్డంకులు..తోపులాటలో గాయాలపై సనత్‌కుమార్ ఆగ్రహం
పరకాల సెప్టెంబర్ 23 (అక్షయ న్యూస్) :
ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించేందుకు వెళ్లిన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా సర్పంచుల జేఏసీ అధ్యక్షుడు సనత్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంజీఎం సందర్శనకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో వినయ్‌భాస్కర్ కాలు, చేతికి గాయాలై రక్తం కారిందని తెలిపారు.
పేదల కోసం వినయ్‌భాస్కర్ ఆసుపత్రి సమస్యలను పరిశీలించేందుకు వెళ్తే అడ్డుకోవడం సరికాదన్నారు. ఎంజీఎంలో సరిపడా పడకలు లేకపోవడం, భవనం పైకప్పులు పెచ్చులూడటం, అంబులెన్సుల కొరత వంటి సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పేదలకు కనీస వైద్యం అందని పరిస్థితి నెలకొందని, ప్రజా పాలన అని చెప్పుకుంటూ ప్రజల ప్రాణాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.వినయ్‌భాస్కర్‌కు జరిగిన ఘటనపై పోలీసులు వెంటనే క్షమాపణ చెప్పాలని సనత్‌కుమార్ డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.