భూముల రీ సర్వేను వేగవంతంగా, పకడ్బందీగా పూర్తి చేయాలి
భూముల రీ సర్వేను వేగవంతంగా, పకడ్బందీగా పూర్తి చేయాలి
హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ రవి
హనుమకొండ సెప్టెంబర్ 25 అక్షయ న్యూస్:
జిల్లాలో పలు గ్రామాల్లో కొనసాగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను వేగవంతంగా పకడ్బందీగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.రవి అధికారులను ఆదేశించారు.
శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో భూముల రీ సర్వే పై సర్వేయర్లు, లైసెన్సుడ్ సర్వేయర్లు, తహసిల్దార్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రవి మాట్లాడుతూ భూముల రీ సర్వే చేపడుతున్న గ్రామాలకు సర్వేయర్లు, జి పి ఓ లు ఉదయం 9 గంటలకు చేరుకొని సర్వే ప్రక్రియను మొదలు పెట్టాలన్నారు. సర్వే ప్రక్రియలో ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. సర్వేయర్లు జిపిఓ లు తహసీల్దారులు సమన్వయంతో భూముల రీసర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.ఈ సమావేశంలో హనుమకొండ ఆర్డిఓ వెంకటేష్, భూములు కొలతల శాఖ ఏడి నూర్ సింగ్, తహసిల్దార్లు , సర్వేయర్లు, లైసెన్సుడ్ సర్వేయర్లు పాల్గొన్నారు.