పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు..
జిల్లా నాయకత్వ ఆదేశాల మేరకు చర్లపల్లి మాజీ సర్పంచ్ చాడ తిరుపతిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్..
మీడియా సమావేశంలో వెల్లడించిన కాంగ్రెస్ మండల సమన్వయ కమిటీ సభ్యులు.
నడి కూడ సెప్టెంబర్ 27 అక్షయ న్యూస్:
నడికుడ మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ నందు ఆదివారం కాంగ్రెస్ పార్టీ నడికుడ మండల సమన్వయ కమిటీ సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ మండల సమన్వయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధిష్టానం మరియు శాసనసభ్యుల ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై చర్యలు తప్పవని తెలియజేశారు. మండలంలోని మూడు గ్రామాల ముగ్గురు ముఖ్య నాయకులు పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిపై పూర్తి నివేదికతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు అదేవిధంగా చర్లపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఓటమికి కారణమైన చర్లపల్లి గ్రామ మాజీ చాడ తిరుపతిరెడ్డిని జిల్లా నాయకత్వ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు అదే కాకుండా గౌరవప్రదమైన హోదాలో ఉన్న వారిని ఇష్ట రీతిలో దుర్భాషలాడుతున్నట్లు రుజువైనందున పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగిందని తెలిపారు మండలంలోని మిగతా రెండు గ్రామాల ఇద్దరు నాయకులకు వారి నివేదికలు అధిష్టానానికి వచ్చిన అనంతరం అతి త్వరలో వారిద్దరి పైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ మీడియా సమావేశంలో నడి కూడ కాంగ్రెస్ మండల సమన్వయ కమిటీ సభ్యులు మల్లారెడ్డి కల్పన రవీందర్ యాదవ్ సదానందం మలహలరావు నారాయణ సమ్మయ్య సురేష్ పలు గ్రామాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు