🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

ప్రీ ప్రైమరీ విద్యతో చిన్నారులకు బంగారు భవిష్యత్తుకు బాట

Main Image

చర్లపల్లి గ్రామ సర్పంచ్ -బండి రేణుక శంకర్

నడి కూడ, సెప్టెంబర్ 28 అక్షయ న్యూస్:
నడికుడా మండలంలోనిచర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరం నుండి ప్రీ ప్రైమరీ విద్యను ప్రారంభించారు. ప్రీ ప్రైమరీలో చేరిన చిన్నారులకు పాఠశాల ఆధ్వర్యంలో వర్క్‌బుక్స్‌ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చర్లపల్లి గ్రామ సర్పంచ్ బండి రేణుక శంకర్ చిన్నారులకు వర్క్‌బుక్స్ అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ బండి రేణుక శంకర్ మాట్లాడుతూ, చిన్నారుల విద్యాభ్యాసానికి ప్రీ ప్రైమరీ విద్య ఎంతో ఉపయోగకరమని అన్నారు. చిన్న వయసులోనే పిల్లల్లో చదువు పట్ల ఆసక్తి, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం పెంపొందించేలా ప్రీ ప్రైమరీ విద్య దోహదపడుతుందని తెలిపారు. ఆటలు, పాటలు, కథలు, చిత్రలేఖనం, రంగులు, అంకెలు తదితర కార్యకలాపాల ద్వారా పిల్లలకు ఆనందదాయకమైన వాతావరణంలో విద్య అందించడం అభినందనీయమన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి అందుబాటులో ఉన్న విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ, ప్రీ ప్రైమరీ విద్య ద్వారా చిన్నారులకు ప్రాథమిక విద్యకు బలమైన పునాది ఏర్పడుతుందని అన్నారు. పిల్లల వయస్సుకు అనుగుణంగా ఆటపాటలు, కథలు, పాటలు, రైమ్స్, డ్రాయింగ్, క్రాఫ్ట్, రంగులు, ఆకారాలు, సంఖ్యలు తదితర అంశాలను సరదాగా నేర్పిస్తున్నామని తెలిపారు. వర్క్‌బుక్స్ ద్వారా పిల్లల్లో రాయడం, గుర్తించడం, ఆలోచించడం వంటి ప్రాథమిక నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.
“మన ఊరి బడి – మన పిల్లల భవిష్యత్తు” అనే ఆలోచనతో ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామని ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ తెలిపారు. తల్లిదండ్రులు ప్రీ ప్రైమరీ విద్యపై అవగాహన పెంచుకుని తమ పిల్లలను పాఠశాలలో చేర్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లకావత్ దేవా, కంచ రాజు కుమార్, ప్రీ ప్రైమరీ టీచర్ బండి శ్వేత, అంగన్వాడీ టీచర్ భీముడి లక్ష్మి,తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home