🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

వాతావరణ మార్పుల ప్రభావం నుంచి రైతులను ఆదుకోవాలి

Main Image


పరకాల ఆర్డీవోకు తెలంగాణ రైతు రక్షణ సమితి ప్రతినిధుల వినతి..


పరకాల సెప్టెంబర్ 28 అక్షయ న్యూస్:

వాతావరణ మార్పుల కారణంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలంగాణ రైతు రక్షణ సమితి తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి జిల్లా వరంగల్ అధ్యక్షులు వరికెల కిషన్ రావు జిల్లా ఉపాధ్యక్షులు చౌల రామారావు పరకాల ఆర్డీవోకు కి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కిషన్ రావు మాట్లాడుతూ.. అధిక ఉష్ణోగ్రతలు, సకాలంలో వర్షాలు కురవకపోవడం, ఒక్కసారిగా భారీ వర్షాలు, అనావృష్టి, అతివృష్టి వంటి పరిస్థితులు పంటలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. ప్రకృతిలో సమతుల్యత దెబ్బతినడం, చెట్ల నరికివేత, నీటి వనరుల పరిరక్షణలో లోపాలు, పర్యావరణ కాలుష్యం తదితర కారణాలతో వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు. చెట్ల నరికివేతను అరికట్టి విస్తృతంగా మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. చెరువులు, కుంటలు, కాలువలు, ఇతర నీటి వనరులను పరిరక్షించి పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. వాతావరణ మార్పుల కారణంగా పంటలు నష్టపోయిన రైతులను గుర్తించి తగిన నష్టపరిహారం అందేలా సంబంధిత శాఖలకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ విధానాలు, ప్రత్యామ్నాయ పంటలు, నీటి సంరక్షణపై అవగాహన కల్పించాలని సూచించారు. వ్యవసాయ, అటవీ శాఖల సమన్వయంతో పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని, గ్రామాల్లో పచ్చదనం, చెట్లు, నీటి వనరుల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో చర్యలు తీసుకోవాలని కోరారు.“ప్రకృతిని కాపాడితే రైతును కాపాడగలం.. రైతును కాపాడితే దేశాన్ని కాపాడగలం” అనే ఉద్దేశంతో వాతావరణ మార్పుల సమస్యపై ప్రత్యేక శ్రద్ధ చూపి రైతులకు అండగా నిలవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు రక్షణ సమితి ప్రతినిధులు, వరికెల కిషన్‌రావు చౌల్ల రామారావు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home