పట్టభద్రుల ఎన్నికలలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి
పట్టభద్రులకు తెలియజేసిన
కోడెపాక కరుణాకర్ పోచంపల్లి రఘుపతి
నడి కూడ అక్టోబర్ 3 అక్షయ న్యూస్:
వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా, నడికూడ మండలం కంటత్మకూర్ గ్రామం లో ఓటరు నమోదు కార్యక్రమాన్ని క్లస్టర్ ఇంచార్జ్ గుడికందుల శివ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో భాగంగా బి ఆర్ ఎస్ పార్టీ మాజీ నడికూడ జడ్పిటిసి కోడేపాక సుమలత కరుణాకర్ పట్టభద్రుల ఓటరు నమోదు నడికూడ మండల్ క్లస్టర్ కో ఆర్డినేటర్ పోచంపల్లి రఘుపతి ఆధ్వర్యంలో ప్రారంభించారు.ఈ సందర్బంగా
మాజీ నడికూడ జడ్పిటిసి కోడేపాక సుమలత కరుణాకర్, పోచంపల్లి రఘుపతి మాట్లాడతూ
.గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదు ప్రక్రియ 2026 సెప్టెంబర్ 28 న మొదలై,నవంబర్ 6వ 2026 తేదిన ముగుస్తుంది.కావున 2023 నవంబర్ 1 కి ముందు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళు అర్హులన్నారు అదే విధంగా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా సమాజానికి దిశానిర్దేశం చేయగలరని పేర్కొన్నారు.
అదేవిధంగా పట్టభద్రుల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న బిఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో నిరుద్యోగిత, ఉద్యోగ కల్పన మరియు పట్టభద్రుల సమస్యలపై అబద్ధపు మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎండగట్టాలని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు.అర్హత కలిగిన పట్టభద్రులంతా ఫారం-18 ద్వారా వెంటనే ఓటరుగా నమోదు చేసుకుని, బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి విజయంలో భాగస్వాములు కావాలని పార్టీ నాయకులకు పట్టభద్రుల కు విజ్ఞప్తి చేశారు...ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు రాయీడి నాధంరేడ్డి బీఆర్ఎస్ పార్టీ గ్రామ ప్రధాన కార్యదర్శి తడక రాజు బీఆర్ఎస్ యూత్ నాయకులు తిరుపతి రేడ్డి పాల్గొన్నారు.