🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

పరకాల ఆర్డిఓ డి.ఎస్.వెంకన్నను అభినందించిన రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి..

Main Image

ఓటరు జాబితా సమగ్ర సవరణ లో 104–పరకాల నియోజకవర్గం రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం...


పరకాల అక్టోబర్ 5 అక్షయ న్యూస్:

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంలో 104–పరకాల శాసనసభ నియోజకవర్గం రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సోమవారం ఉదయం పరకాల రెవెన్యూ డివిజనల్ అధికారి డి.ఎస్. వెంకన్న ని ఫోన్ ద్వారా ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా ఎస్ ఐ ఆర్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో కృషి చేసిన పరకాల డివిజన్ ,తహసీల్దార్లు, ఎంపీడీవోలు, బి ఎల్ ఓ సూపర్వైజర్లు మరియు ఇతర ఎన్నికల సిబ్బందిని, బూత్ లెవెల్ ఏజెంట్లను ఆర్డిఓ వెంకన్న అభినందించారు.

🏠 Home