వెంకటేశ్వర్ల పల్లి గ్రామాన్ని పట్టించుకునే నాధుడే లేరా..!
గ్రామం మూడుమక్కలాటగా కావడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం..
శిలాఫలకాలకే పరిమితమా పనులు ప్రారంభం ఇంకెప్పుడు..
జర మా గ్రామం పై కన్నేయండి ఎమ్మెల్యే సారు అంటూ గోడు వెళ్ళబోసుకుంటున్నా సర్పంచ్..
నడికుడ అక్టోబర్ 5 అక్షయ న్యూస్:
: నడికుడ మండలం వెంకటేశ్వర్ల పల్లి గ్రామం మూడుముక్కలాటగా అయింది గ్రామానికి తల్లి ఎవరో తండ్రి ఎవరో తేల్చుకోలేని స్థితిలో గ్రామ ప్రజలు నిరుత్సాహ స్థితిలో ఉన్నారు. పోలీస్ స్టేషన్ పరకాలకి. రెవిన్యూ ఉపాధి హామీ నడికుడ కి. గ్రామ అభివృద్ధి సంక్షేమం కమలాపూర్ లో ఉంచడం జరిగింది మూడు మండలాలు తిరుగుతూ గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ నేతల ప్రదక్షిణలు చేస్తున్న మా గ్రామాన్ని పట్టించుకునే నాధుడే లేరు మా గ్రామానికి దేవుడే దిక్క అంటూ గ్రామ సర్పంచ్ పెండ్యాల మహేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ వెంకటేశ్వర్లపల్లి కమలాపూర్ గ్రామంకు ఉన్న రోడ్స్ మా గ్రామ పరిధిలో వాగు నుంచి వెంకటేశ్వర్లపల్లి వరకు వెంకటేశ్వర్లపల్లి నుండి మర్రిపల్లిగూడెం వరకు నిన్న గ్రామ ప్రజల సహకారం తో 6 కిలోమీటర్లు మోరం పోయడం జరిగింది. గత ప్రభుత్వం వాగు నుంచి వెంకటేశ్వర్ల పల్లి వరకు ఎం ఆర్ ఆర్ గ్రాంట్ నుండి ఒక కోటి 50 లక్షల గ్రాంట్ నిధులు మంజూరు చేయగా అట్టి పనులను ప్రస్తుత ఎమ్మెల్యే గత సంవత్సరం పనులు ప్రారంభానికి శంకుస్థాపనలు చేయడం జరిగింది పనులు శంకుస్థాపనలకే పరిమితం అయ్యాయి కానీ ఆనాటి నుండి నేటి వరకు ఎలాంటి పనులు ప్రారంభం కాకపోవడం వలన గ్రామస్తులకు చుట్టు గ్రామస్తులకు చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని జర పరకాల ఎమ్మెల్యే సారు వెంకటేశ్వర్ల పల్లి గ్రామ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్ని పాలనలు ఒకే మండలంలో ఉండేలా చొరవ తీసుకోవాలని నిర్లక్ష్యంగా పనులు చేపట్టకుండా రోడ్డు పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని పనులు ప్రారంభమయ్యేలా చొరవ తీసుకోవాలని సర్పంచ్ పెండ్యాల మహేందర్రెడ్డి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వేడుకున్నారు