🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

స్నేహితుడి కుటుంబానికి స్నేహితుల ఆర్థిక చేయూత

Main Image

చిట్యాల, అక్టోబర్ 05 అక్షయ న్యూస్:

ఆపదలో ఉన్న స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు పదవ తరగతి 2006 బ్యాచ్‌కు చెందిన బాల్యమిత్రులు. చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించిన పెండెల ప్రవీణ్ తండ్రి క్రీ.శే. సమ్మయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషాదంలో ఉన్న ప్రవీణ్ కుటుంబాన్ని పరామర్శించిన ఆయన బాల్యమిత్రులు, కుటుంబానికి తమవంతు ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పదవ తరగతి స్నేహితులంతా కలిసి రూ.20 వేల నగదును జమ చేసుకుని.. మృతుడి దశదినకర్మ సందర్భంగా స్వగ్రామమైన వెల్లంపల్లిలో బాధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయంగా అందజేశారు. ఇలా, తమ బ్యాచ్ మిత్రబృందంలో ఆపదలో ఉన్న స్నేహితుల కుటుంబాలకు ఆర్థిక సహాయాలు అందజేయడం 15వ సారి అని తెలిపారు. ఆపద సమయంలో తమ స్నేహితుల కుటుంబాలకు అండగా నిలవడం ద్వారా తమ మధ్య ఉన్న అనుబంధాన్ని, మానవీయతను చాటుకున్నారు.ఏళ్ల క్రితం కలిసి చదువుకున్న స్నేహితులు.. కాలం గడిచినా తమ బంధాన్ని మరువకుండా కష్టకాలంలో తోడుగా నిలవడం పలువురి ప్రశంసలు అందుకుంది. స్నేహం అంటే కేవలం సంతోషాలను పంచుకోవడం మాత్రమే కాదని, కష్టసమయంలో ఒకరికొకరు అండగా నిలవడమే నిజమైన స్నేహబంధమని వారు చాటిచెప్పారు.ఈ కార్యక్రమంలో బాల్యమిత్రులు చింతల మహేందర్, మురహరి భానుచందర్, కట్కూరి కుమార్, పాశిగంటి మహేందర్, కలికోట లక్ష్మణ్, సిలివేరి రవీందర్, రాయిని శ్రీకాంత్, దూడపాక రాజేందర్, కప్పల రాజేష్, సిలివేరి రవీందర్, గుర్రపు రాజేందర్ , రేణికుంట్ల రమాకాంత్, ఎండి చాంద్ పాషా పాల్గొన్నారు.
🏠 Home