🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

ఏసీబీ అధికారుల వలకు చిక్కిన రెండు అవినీతి చేపలు

Main Image
ఏసీబీ అధికారుల వలకు చిక్కిన రెండు అవినీతి చేపలు


సిద్దిపేట అక్టోబర్ 06 అక్షయ న్యూస్:

తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ మరోసారి లంచ గొండి అధికారులపై దాడి చేసి పట్టుకు న్నారు. ఇటీవలి కాలంలో రాష్ట్రవ్యా ప్తంగా దాడులు చేస్తూ.. లంచం తీసుకుంటున్న అధికారుల భరతం పడుతున్న సంగతి పాఠకులకు తెలిసిందే,ఈ క్రమంలోనే సిద్దిపేట జిల్లాలో ఓ పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటుండగా మంగళవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టు కుని అరెస్ట్ చేశారు. ఇళ్ల మ్యుటేషన్ దరఖాస్తు ఫైల్‌ను ముందుకు పంపిం చి.. తదుపరి ప్రక్రియ పూర్తి చేసేందుకు ఆ పంచాయతీ సెక్రటరీ లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రాగా.. ఏసీబీ రంగం లోకి దిగింది. ఈ క్రమంలోనే వాళ్లు వేసిన వలలో పంచా యతీ కార్యదర్శితో పాటు.. కాంట్రాక్ట్ ఉద్యోగి పట్టుబడ్డారు. సిద్దిపేట జిల్లాలోని నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సంఘటన చోటుచేసుకుంది. ఏసీబీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జక్కాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి బి. అరు ణ,అదే గ్రామంలో కాంట్రాక్ట్ కారోబార్‌గా పనిచేస్తున్న దాసరి సంతోష్‌లు15 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ వ్యక్తి తన పేరు మీద ఉన్న రెండు ఇళ్లకు సంబంధించిన మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నా డు. ఆ రెండు ఇళ్లకు మ్యుటేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు అరుణ మొదట రూ.20 వేలు లంచం డిమాండ్ చేసినట్లు ఆ వ్యక్తి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఆ తర్వాత లంచాన్ని రూ.15 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది.
🏠 Home