🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

పరకాల పురపాలక సంఘం.10 వార్డులో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ...

Main Image

స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ చేసిన స్థానిక కౌన్సిలర్ పసుల లావణ్య రమేష్


పరకాల అక్టోబర్ 7 అక్షయ న్యూస్:


పరకాల పురపాలక సంఘం 10వ వార్డు పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశాల మేరకు 10వ వార్డు కౌన్సిలర్ పసుల లావణ్య రమేష్ ఆధ్వర్యంలో వార్డు పరిధిలోని దారిద్ర రేఖకు దిగువగా ఉన్నటువంటి కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా కౌన్సిలర్ పసుల లావణ్య రమేష్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందన్నారు. అలాగే గత ప్రభుత్వం హయాంలో ఒక రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేని పరిస్థితి ఉందన్నారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెల్ల రేషన్ కార్డు లేని నిరుపేద కుటుంబాలకు ఈ స్మార్ట్ కార్డు ల పంపిణీ చేయడం నిరంతర ప్రక్రియగా చేపట్టడం పట్ల రాష్ట్ర ప్రజలందరూ సంతోషాన్నివ్యక్తపరుస్తున్నారన్నారు
.ఈ కార్యక్రమంలో డి.టి.సుమన్ఆర్.ఐ.
దామోదర్.ఆర్ఏ బిక్షపతి డీలర్ దుప్పటి సాంబశివుడు, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home