పరకాల వంద పడకల ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్ లో తొలి శస్త్ర చికిత్స సేవలు..
ఆసుపత్రి సూపర్డెంట్ వంశీకృష్ణ నేతృత్యంలో
ప్రసవాన్ని విజయవంతంగా నిర్వహించిన వైద్య బృందం..
పరకాల అక్టోబర్ 9 అక్షయ న్యూస్
పరకాల పట్టణ కేంద్రంలో నూతనంగా నిర్మించిన 100 పడకల ఆస్పత్రి భవనంలో ఏర్పాటు చేసిన ఆపరేషన్ థియేటర్‌లో తొలి శస్త్రచికిత్సా సేవలు ప్రారంభించబడినాయి ఈ సందర్భంగా అధిక ప్రమాద గర్భధారణకు సంబంధించిన ప్రసవాన్ని వైద్య బృందం విజయవంతంగా నిర్వహించింది. ప్రస్తుతం తల్లి శిశువు ఆరోగ్యంగా ఉన్నారుఈ వైద్య సేవలు ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వంశీ కృష్ణ పర్యవేక్షణలో నిర్వహించబడినాయిఈ కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ కవిత, డాక్టర్ మౌనిక అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ నారాయణ రెడ్డి, శిశు వైద్య నిపుణులు డాక్టర్ నవీన్, నర్సింగ్ సూపరింటెండెంట్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్లు, ఓటీ అసిస్టెంట్లు మరియు ఇతర వైద్య సిబ్బంది పాల్గొని తమ సేవలను అందించారునూతన భవనంలో ఆపరేషన్ థియేటర్ సేవలు ప్రారంభమవడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం విశేషం.