ప్రజాసేవే పోలీసుల పరమ ధ్యేయం -వరంగల్ సీపీ ఎన్. శ్వేతా
వరంగల్ పోలీస్ కమిషనర్ ముల్కనూర్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ
హనుమకొండ ప్రతినిధి అక్టోబర్ 9 అక్షయ న్యూస్
వార్షిక తనిఖీలో భాగంగా, ముల్కనూరు పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం తనిఖీ చేసిన వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేతా, ఐపీఎస్. ఎస్సై ఎమ్.రాజు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని వివిధ రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, స్టేషన్ పరిసరాలు, సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలను కమిషనర్ గారు క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీసు అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించి, గ్రామీణ ప్రాంత ప్రజలు చిన్న చిన్న సమస్యలకు కూడా పోలీసులనే ఆశ్రయిస్తారని అలాంటి సమయంలో వారికి సరైన న్యాయం చేసి వారి మెప్పును పొందాలని, ప్రజలకు సేవ చేయటం పోలీసులకు దక్కిన గౌరవమని, ప్రజాసేవే పోలీసుల పరమ ధ్యేయం అని తెలిపారు. ప్రజలతో మర్యాదగా వ్యవహరిస్తూ వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేలా పనిచేయాలని సీపీ సూచించారు. అనంతరము కమిషనర్ స్టేషన్ ఆవరణలో మామిడి మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి, ఎల్కతుర్తి సి ఐ కె శ్రీను, ముల్కనూరు ఎస్సై ఎమ్. రాజు, వంగర ఎస్సై దివ్య తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.