🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

పరకాల పట్టణ కేంద్రంలో ఘనంగా తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు

Main Image Additional Image

బతుకమ్మ సంబరాలలో పాల్గొని పట్టణ ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్


పరకాల అక్టోబర్ 10 అక్షయ న్యూస్:


పరకాల పట్టణ కేంద్రంలోని, చెన్నకేశవ స్వామి గుడి,పోచమ్మ గుడి,పెద్దరాజి పేట,అంగడి మైదానం వద్ద నిర్వహించిన ఎంగిలిపూల బతుకమ్మ సంబరాల్లో పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ పాల్గొన్నారు.అనంతరం చైర్మన్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.ప్రకృతిని ఆరాధిస్తూ,పూలను పూజిస్తూ జరుపుకునే ఈ పండుగ మహిళల ఐక్యతకు,తెలంగాణ సంస్కృతీ వైభవానికి నిదర్శనమని అన్నారు. పురపాలక సంఘం పరిధిలో పలుచోట్ల మహిళలు బతుకమ్మ ఆడుకోవడానికి పురపాలక సంఘం ఆధ్వర్యంలో సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్స్,పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు,మాజీ ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు
🏠 Home