పరకాల జిల్లా హోదాపై బహిరంగ చర్చకు సిద్ధం.... మీరు సిద్ధమా..
బీఆర్ఎస్ నాయకుల సవాల్ కు ప్రతి సవాల్ విసిరిన బీజేపీ నాయకుడు-ఆకుల శ్రీధర్
బీఆర్‌ఎస్ నేతలు తేదీ, సమయం ప్రకటించాలి.
పరకాల అక్టోబర్ 13 అక్షయ న్యూస్:
బీఆర్‌ఎస్ నాయకులు బీజేపీని విమర్శించే ముందు పదేళ్ల పాలనలో పరకాలకు జిల్లా హోదా ఎందుకు కల్పించలేకపోయారో ప్రజలకు సమాధానం చెప్పాలని
బీజేపీ జిల్లా నాయకుడు ఆకుల శ్రీధర్
డిమాండ్ చేశారు. పరకాల అభివృద్ధి, జిల్లా హోదా అంశాలపై బీఆర్‌ఎస్ నాయకులు సిద్ధంగా ఉంటే తేదీ, సమయం, స్థలం ప్రకటించి బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.తెలంగాణలో 33 జిల్లాలను ఏర్పాటు చేశామని చెప్పుకునే బీఆర్‌ఎస్ నాయకులు.. చారిత్రక నేపథ్యం కలిగిన పరకాలను అమరవీరుల జిల్లాగా ప్రకటించడంలో ఎందుకు విఫలమయ్యారో వివరించాలని డిమాండ్ చేశారు.
*రెండుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం పొందిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, జిల్లాల పునర్విభజన సమయంలో పరకాల ప్రజల ఆకాంక్షను ఎందుకు నెరవేర్చలేకపోయారో చెప్పాలన్నారు.
కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తే పరకాలకు జిల్లా హోదా వస్తుందా? అని ప్రశ్నించారు.
*అభివృద్ధిపై ఆధారాలతో చర్చిద్దాం*
పరకాల జిల్లా హోదా, ప్రభుత్వ ఆసుపత్రి, విద్యా సదుపాయాలు, రహదారులు, ఇతర అభివృద్ధి పనులపై గత పాలనలో సాధించిన ఫలితాలు, నెరవేరని హామీలను ప్రజల సమక్షంలో ఆధారాలతో చర్చించేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని ఆకుల శ్రీధర్ తెలిపారు. బీజేపీని విమర్శించే ముందు పరకాలకు జిల్లా హోదా ఎందుకు తీసుకురాలేకపోయారో బీఆర్‌ఎస్ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పరకాల ఆత్మగౌరవం కోసం, అమరవీరుల జిల్లాగా గుర్తింపు సాధించే లక్ష్యంతో ప్రజల పక్షాన బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.