వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో పాత వస్తువుల బహిరంగ వేలంపాట నిర్వహణ
హనుమకొండ అక్టోబర్ 17 అక్షయ న్యూస్:
వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో పాడైపోయిన పాత సామగ్రి విక్రయానికి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శనివారం బహిరంగ వేలంపాట నిర్వహించారు. పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ఆదేశాల మేరకు అడిషనల్ డీసీపీ రాయల ప్రభాకర్ రావు నేతృత్వంలోని కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేలంలో సుమారు 40 మంది వ్యాపారులు పాల్గొన్నారు. వరంగల్ ఆటోనగర్‌కు చెందిన పటేల్ ఖాన్ పాత సామగ్రిని రూ.7,30,000 లకు వేలంపాట లో దక్కించుకున్నారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (ఏఆర్) సురేష్, ఏసీపీ (ఏఆర్) సురేంద్ర, అంతయ్య , ఆర్ఐ స్పర్జన్ రాజ్ లు పాల్గొన్నారు.