పోలీస్ హెడ్ క్వార్టర్ లో ఆయుధ పూజ నిర్వహించిన వరంగల్ సిపి.ఎన్.శ్వేత ఐపిఎస్
ఆయుధ భాండాగారం, పోలీసు వాహనాలకు ప్రత్యేక పూజలు.
ప్రజలకు, పోలీసులకు, వారి కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన పోలీస్ కమిషనర్.
హనుమకొండ అక్టోబర్ 20 అక్షయ న్యూస్:
మంగళవారం విజయదశమి పర్వదిన వేడుకలు వరంగల్ పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో, ఆనందోత్సాహాల నడుమ, భక్తిశ్రద్ధలతో ప్రజలు ఘనంగా నిర్వహించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. ఉదయం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని ఆయుధ భాండాగార మందిరంలో వరంగల్ పోలీస్ కమిషనర్ , పోలీసు అధికారులు వేద పండితులతో సాంప్రదాయబద్ధంగా దుర్గామాత సన్నిధిలో ప్రత్యేక ఆయుధ పూజలు నిర్వహించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతికగా ఉన్న విజయదశమి వేడుకలను జరుపుకున్నారు. అనంతరం సాయుద పోలీస్ విభాగంలో పనిచేస్తున్న పోలీసు వాహనాల విభాగంలో సిబ్బందితో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలు ఘనంగా విజయదశమి ఉత్సవాలను జరుపుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రశాంత వాతావరణం నెలకొల్పడానికి పోలీస్ శాఖ అహర్నిశలు శ్రమిస్తున్నట్లు తెలిపారు. పోలీసు శాఖలో ఆయుధాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని విజయదశమి రోజున ఆయుధాలతో ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ అని తెలుపుతూ, ప్రజలందరికీ విజయదశమి సందర్భంగా విజయం చేకూరాలని ఆకర్షించారు. , అనంతరం జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డిసిపి , అంకిత్ కుమార్, సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత, అడిషనల్ డీసీపీ, (పరిపాలన) రాయల ప్రభాకర్ రావు, అడిషనల్ డిసిపి (క్రైమ్స్) బాలస్వామి, ఆర్మ్డ్ రిజర్వు అడిషనల్ డిసీపీలు సురేష్, శ్రీనివాస్, ఆర్మ్డ్ రిజర్వు, ఏసీపీలు అంతయ్య, సురేంద్ర ఏసీపీలు రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు లు, స్పర్జన్ రాజ్, సతీష్, శ్రీధర్, మోటార్ ట్రాన్స్పోర్ట్ టీం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.