ప్రజాకవి కాళోజీ జీవితం ఆదర్శనీయం
కాళోజీ జయంతిని పురస్కరించుకని కాళోజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎంపీ డాక్టర్ కడియం కావ్య, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, అక్షయన్యూస్ సెప్టెంబర్ 9 హనుమకొండ ప్రజాకవి కాళోజీ నారాయణరావు తన కలం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారని, చైతన్య స్ఫూర్తిని కలిగించిన కాళోజీ జీవితం ఆదర్శనీయమని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. కాళోజీ జయంతిని పురస్కరించుకుని బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని కాళోజీ విగ్రహానికి ఎంపీ డాక్టర్ కడియం కావ్య, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, అదనపు కలెక్టర్ ఎన్. రవి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత అంపశయ్య నవీన్, తదితర ప్రముఖులు పూలమాలలు...