నేటి నుండి హనుమకొండ బస్టాండ్ మీదుగా లోకల్ బస్సులు

నేటి నుండి హనుమకొండ బస్టాండ్ మీదుగా లోకల్ బస్సులు -టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజనల్ మేనేజర్ భవానీ ప్రసాద్ హనుమకొండ: ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని వరంగల్ కాజీపేట మధ్య మంగళవారం నుండి అదనంగా లోకల్ బస్సులు హనుమకొండ బస్టాండ్ మీదుగా నడపనున్నట్లు వరంగల్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ భవాని ప్రసాద్ తెలిపారు.1 బి పేరుతో ప్రతిరోజు 46 ట్రిప్పులను తిప్పడం జరుగుతుందని ఆయన వివరించారు. వరంగల్ నుండి హనుమకొండ చౌరస్తా, హనుమకొండ బస్టాండ్, కాళోజీ కళాక్షేత్రం, బాలసముద్రం, అదాలత్ మీదుగా కాజీపేటకు పోవడం జరుగుతుందన్నారు. అదేవిధంగా కాజీపేట నుండి అదాలత్, బాలసముద్రం, కాళోజీ కళాక్షేత్రం, అశోక జంక్షన్ ,హనుమకొండ చౌరస్తా మీదుగా వరంగల్ కు...