సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి
హనుమకొండ జిల్లా జాక్ అధ్యక్షుడిగా సనత్‌కుమార్ పటేల్ నియామకం పరకాల సెప్టెంబర్ 16 (అక్షయ న్యూస్) : తెలంగాణ సర్పంచుల సంఘం జాక్–2026 సర్పంచుల సంఘం జాక్ వ్యవస్థాపక అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర కమిటీ గౌరవ అధ్యక్షుడు, మాజీ మంత్రి, తెలంగాణ ఉద్యమకారుడు విరసనోళ్ల శ్రీనివాస్‌గౌడ్ బుధవారం హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పరకాల మండలం అలియాబాద్ గ్రామ సర్పంచ్ శాతరాశి సనత్‌కుమార్ పటేల్‌ను నియమించారు. ఈ సందర్భంగా సనత్‌కుమార్ పటేల్ మాట్లాడుతూ రాష్ట్రంలోని సర్పంచుల సమస్యల పరిష్కారం, వారి హక్కుల పరిరక్షణతో పాటు...