ఎమ్మెల్సీ పోచంపల్లి స్వగ్రామం లో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..

ఎమ్మెల్సీ పోచంపల్లి స్వగ్రామం లో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన వరికోల్ గ్రామ బీఆర్‌ఎస్ నాయకులు హనుమకొండ సెప్టెంబర్ 20 (జనం సాక్షి) : హనుమకొండ భవానీనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం యందు నడికూడ మండలం వరికోల్ గ్రామానికి చెందిన 50 మంది బీఆర్‌ఎస్ నాయకులు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు .అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు....