పరకాల ఆదర్శనగర్ గణనాథునికి 51 రకాల నైవేద్యాలు.

పరకాల ఆదర్శనగర్ గణనాథునికి 51 రకాల నైవేద్యాలు. పరకాల సెప్టెంబర్ 21 (అక్షయ న్యూస్) : పరకాల పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీలో గణనాథుడు భక్తుల నుండి విశేష పూజలు అందుకుంటున్నాడు. ఆదర్శనగర్ గణేష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా సోమవారం రోజున గణనాధునికి 51 రకాల నైవేద్యాలను భక్తులు సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఆధ్యాత్మిక, సాంస్కృతి కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.