గుండ్ల సింగారం బాలాజీ బంజారా కాలనీలో ఘనంగా గణనాథుడి నిమజ్జన వేడుకలు

గుండ్ల సింగారం బాలాజీ బంజారా కాలనీలో ఘనంగా గణనాథుడి నిమజ్జన వేడుకలు హనుమకొండ సెప్టెంబర్ 24 అక్షయ న్యూస్: హనుమకొండ జిల్లా గుండ్ల సింగారం బాలాజీ బంజారా కాలనీలో బంజారా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి.నవరాత్రి ఉత్సవాల చివరి రోజు బుధవారం వినాయకుని నిమజ్జన కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు, కాలనీవాసులు, భక్తులు పెద్ద ఎత్తున నిర్వహించారు.హనుమకొండ జిల్లా గుండ్ల సింగారం గ్రామంలో వినాయకుని నిమజ్జనం వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కాలనీవాసులు భారీ సంఖ్యలో నిమజ్జన ర్యాలీలో పాల్గొన్నారు. ఆటపాటలు, భక్తి గీతాలు, డప్పు చప్పుళ్ల నడుమ డీజే తో వినాయకుని ఊరేగింపు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో నిమజ్జనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు....