పాడి గేదెల పెంపకంతో కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి
ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన పాడి గేదెలను పరిశీలించిన ఎమ్మెల్యే రేవూరి హనుమకొండ సెప్టెంబర్ 27 అక్షయ న్యూస్: ఆత్మకూరు మండలం నాగయ్య పల్లి గ్రామంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన పాడి గేదెలను ఆదివారం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...పాడి గేదెల పెంపకం ద్వారా లబ్ధిదారులు నిరంతర ఆదాయం పొందుతూ తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుచు కోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ప్రతి కుటుంబం ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి...