ప్రీ ప్రైమరీ విద్యతో చిన్నారులకు బంగారు భవిష్యత్తుకు బాట

చర్లపల్లి గ్రామ సర్పంచ్ -బండి రేణుక శంకర్ నడి కూడ, సెప్టెంబర్ 28 అక్షయ న్యూస్: నడికుడా మండలంలోనిచర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరం నుండి ప్రీ ప్రైమరీ విద్యను ప్రారంభించారు. ప్రీ ప్రైమరీలో చేరిన చిన్నారులకు పాఠశాల ఆధ్వర్యంలో వర్క్‌బుక్స్‌ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చర్లపల్లి గ్రామ సర్పంచ్ బండి రేణుక శంకర్ చిన్నారులకు వర్క్‌బుక్స్ అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ బండి రేణుక శంకర్ మాట్లాడుతూ, చిన్నారుల విద్యాభ్యాసానికి ప్రీ ప్రైమరీ విద్య ఎంతో ఉపయోగకరమని అన్నారు. చిన్న వయసులోనే పిల్లల్లో చదువు పట్ల ఆసక్తి, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం పెంపొందించేలా ప్రీ ప్రైమరీ విద్య దోహదపడుతుందని తెలిపారు....