వాతావరణ మార్పుల ప్రభావం నుంచి రైతులను ఆదుకోవాలి

పరకాల ఆర్డీవోకు తెలంగాణ రైతు రక్షణ సమితి ప్రతినిధుల వినతి.. పరకాల సెప్టెంబర్ 28 అక్షయ న్యూస్: వాతావరణ మార్పుల కారణంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలంగాణ రైతు రక్షణ సమితి తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి జిల్లా వరంగల్ అధ్యక్షులు వరికెల కిషన్ రావు జిల్లా ఉపాధ్యక్షులు చౌల రామారావు పరకాల ఆర్డీవోకు కి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కిషన్ రావు మాట్లాడుతూ.. అధిక ఉష్ణోగ్రతలు, సకాలంలో వర్షాలు కురవకపోవడం, ఒక్కసారిగా భారీ వర్షాలు, అనావృష్టి, అతివృష్టి వంటి పరిస్థితులు పంటలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. ప్రకృతిలో సమతుల్యత దెబ్బతినడం, చెట్ల నరికివేత,...