బైక్ ప్రమాదంలో గాయపడిన బొమ్మన బోయిన రవీందర్‌ ని పరామర్శించిన చల్లా

పరకాల సెప్టెంబర్ 29 అక్షయ న్యూస్: నడికూడ మండలం పులిగిల్ల గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు బొమ్మన బోయిన రవీందర్ ఇటీవల బైక్ ప్రమాదంలో గాయపడి, కాలు సర్జరీ అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రవీందర్‌ను పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు