పరకాలలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బిజెపి
మోదీపై, హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు సహించం పరకాల సెప్టెంబర్ 29 అక్షయ న్యూస్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ పరకాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం పరకాల మార్కెట్ సర్కిల్ వద్దసీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్ర రావు పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీజేపీ పరకాల పట్టణ శాఖ అధ్యక్షులు గాజుల నిరంజన్ నాయకత్వం వహించారు.ఈ సందర్భంగా గాజుల నిరంజన్ మాట్లాడుతూ.. దేశ ప్రధానిపై రాజకీయ విమర్శలు చేయడం ఒక విషయం, కానీ కోట్లాది మంది హిందువులు ఆరాధించే శ్రీరాముడు, పరమశివుడి...