స్నేహితుడి కుటుంబానికి స్నేహితుల ఆర్థిక చేయూత
చిట్యాల, అక్టోబర్ 05 అక్షయ న్యూస్: ఆపదలో ఉన్న స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు పదవ తరగతి 2006 బ్యాచ్‌కు చెందిన బాల్యమిత్రులు. చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించిన పెండెల ప్రవీణ్ తండ్రి క్రీ.శే. సమ్మయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషాదంలో ఉన్న ప్రవీణ్ కుటుంబాన్ని పరామర్శించిన ఆయన బాల్యమిత్రులు, కుటుంబానికి తమవంతు ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పదవ తరగతి స్నేహితులంతా కలిసి రూ.20 వేల నగదును జమ చేసుకుని.. మృతుడి దశదినకర్మ సందర్భంగా స్వగ్రామమైన వెల్లంపల్లిలో బాధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయంగా అందజేశారు. ఇలా, తమ బ్యాచ్ మిత్రబృందంలో ఆపదలో...