సఫాయి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.

ఆల్‌ ఇండియా సఫాయి మజ్దూర్‌ కాంగ్రెస్‌ ట్రేడ్‌ యూనియన్‌ జాతీయ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోదా రామకృష్ణ పరకాల అక్టోబర్ 6 అక్షయ న్యూస్: సఫాయి కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆల్‌ ఇండియా సఫాయి మజ్దూర్‌ కాంగ్రెస్‌ ట్రేడ్‌ యూనియన్‌ జాతీయ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోదా రామకృష్ణ కోరారు. భారత జాతీయ సఫాయి కర్మచారి కమిషన్‌ (ఎన్‌సీఎస్‌కే) వైస్‌ చైర్మన్‌ హర్దీప్‌ సింగ్‌ గిల్‌ హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా మంగళవారం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సఫాయి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రాలు అందజేశారు....