భూముల రీసర్వేతో సమస్యలకు పరిష్కారం

పరకాల మండలం కామారెడ్డిపల్లి లో భూ రీసర్వే ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్ పరకాల అక్టోబర్ 9 అక్షయ న్యూస్ భూముల రీసర్వే తో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి అన్నారు.శుక్రవారం హనుమకొండ పరకాల మండలం కామారెడ్డిపల్లిలో చేపట్టిన భూముల రీ-సర్వే ప్రక్రియను జిల్లా అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామానికి సంబంధించిన భూముల వివరాలు, ఇప్పటివరకు చేపట్టిన రీసర్వే పురోగతి గురించిన వివరాలను సర్వేయర్లు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. స్థానిక రైతులతో అదనపు కలెక్టర్ మాట్లాడారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి మాట్లాడుతూ.. భూముల రీ సర్వే వేగవంతంగా సాగాలని...