అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. బీజేపీ నాయకులు సిద్ధమా..?
ఖబడ్దార్ బీజేపీ నాయకులారా... కేసీఆర్ పాలనలోనే ప్రజలకు చేరువైన పరిపాలన పరకాల అభివృద్ధిలో చల్లా ధర్మారెడ్డి కృషి మరువలేనిది పరకాల అభివృద్ధిపై మాట్లాడే నైతిక హక్కు బీజేపీ నాయకులకు ఉందా.. పరకాల అక్టోబర్ 11 అక్షయ న్యూస్: అదివారం పరకాల పట్టణ కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది .ఈ సమావేశంలో వారు మాట్లాడుతూతెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 33 జిల్లాలను ఏర్పాటు చేసి, జిల్లా కలెక్టరేట్లు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ద్వారా ప్రజలకు మెరుగైన పరిపాలన అందించారని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు.గతంలో జిల్లా కేంద్రాలకు...