పరకాల జిల్లా హోదాపై బహిరంగ చర్చకు సిద్ధం.... మీరు సిద్ధమా..
బీఆర్ఎస్ నాయకుల సవాల్ కు ప్రతి సవాల్ విసిరిన బీజేపీ నాయకుడు-ఆకుల శ్రీధర్ బీఆర్‌ఎస్ నేతలు తేదీ, సమయం ప్రకటించాలి. పరకాల అక్టోబర్ 13 అక్షయ న్యూస్: బీఆర్‌ఎస్ నాయకులు బీజేపీని విమర్శించే ముందు పదేళ్ల పాలనలో పరకాలకు జిల్లా హోదా ఎందుకు కల్పించలేకపోయారో ప్రజలకు సమాధానం చెప్పాలని బీజేపీ జిల్లా నాయకుడు ఆకుల శ్రీధర్ డిమాండ్ చేశారు. పరకాల అభివృద్ధి, జిల్లా హోదా అంశాలపై బీఆర్‌ఎస్ నాయకులు సిద్ధంగా ఉంటే తేదీ, సమయం, స్థలం ప్రకటించి బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.తెలంగాణలో 33 జిల్లాలను ఏర్పాటు చేశామని చెప్పుకునే బీఆర్‌ఎస్ నాయకులు.. చారిత్రక నేపథ్యం కలిగిన పరకాలను అమరవీరుల జిల్లాగా ప్రకటించడంలో ఎందుకు...