వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ఆటపాటలతో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ఆటపాటలతో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు బతుకమ్మ ఆడిన వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసు కానిస్టేబుళ్ల నుంచి మొదలుకొని ఉన్నతాధికారుల కోసం గురువారం సాయంత్రం హనుమకొండ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, ఐపీఎస్, సెంట్రల్ జోన్ డీసీపీ తార కవితతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ మరియు సెంట్రల్ జోన్ డీసీపీలు స్వయంగా సంప్రదాయ పాటలను ఆలపిస్తూ, మహిళా సిబ్బందితో కలిసి నృత్యాలు చేస్తూ మహిళా పోలీసు సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్...