యూత్ డిక్లరేషన్ హామీల అమలుకు బీజేవైఎం నిరసన ర్యాలీ

రూ.4 వేల నిరుద్యోగ భృతి, 2 లక్షల ఉద్యోగాలు, రాజీవ్ యువ వికాసం, విద్యార్థినిల స్కూటీ హామీలను అమలు చేయాలని డిమాండ్ పరకాల అక్టోబర్ 17 అక్షయ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన యూత్ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం పరకాల పట్టణ అధ్యక్షుడు దాసరి ప్రణీత్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పరకాలలోని బీజేపీ కార్యాలయం నుంచి బస్టాండ్‌లోని అంబేడ్కర్ సెంటర్ వరకు బీజేవైఎం నాయకులు ర్యాలీ చేపట్టి, ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం యూత్ డిక్లరేషన్‌లో పేర్కొన్న నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి, 2 లక్షల...