పోలీసు అమరులకు ఘన నివాళి

పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత హనుమకొండ ప్రతినిధి అక్టోబర్ అక్షయ న్యూస్: అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం హనుమకొండలోని పోలీస్ హెడ్ క్వార్టర్ లోని అమరుల స్తూపం వద్ద హనుమకొండ,వరంగల్ జిల్లాల కలెక్టర్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ఐపీఎస్ పోలీసు అమరులను స్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పించారు. దేశ రక్షణ కోసం, ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులకు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు, పోలీస్ కమిషనర్...