పోలీసుల త్యాగాలు మరువలేనివి

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రక్తదానం చేసిన కౌన్సిలర్ పూర్ణ చారి పరకాల అక్టోబర్ 22 అక్షయ న్యూస్: పరకాల పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పరకాల డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో లలిత కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పరకాల మున్సిపల్ 9వ వార్డు కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి రక్తదానం చేసి అమరవీరులకు ఘన నివాళులర్పించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలను సైతం త్యాగం చేసిన పోలీసుల సేవలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా పూర్ణ చారి మాట్లాడుతూ.. పోలీసుల త్యాగాల ఫలితంగానే ప్రజలు ప్రశాంతంగా జీవించగలుగుతున్నారని పేర్కొన్నారు. ప్రజల భద్రత కోసం...