Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం,

Author
Posted By AKSHAYA NEWS
| 17 Sep 2026, 02:37 PM |
బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం,

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు

ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ

బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం, - Additional Image

ముఖ్య అతిథులుగా పాల్గొన్న డాక్టర్ కాళీ ప్రసాద్ రావు డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్

ఇవి కూడా చదవండి


పరకాల సెప్టెంబర్ 17 (అక్షయ న్యూస్) : పరకాల పట్టణ కేంద్రంలో పట్టణ బిజెపి అధ్యక్షులు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పరకాల నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే డా. పగడాల కాళీ ప్రసాద్ రావు , సీనియర్ నాయకులు డా. సిరింగి సంతోష్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా శక్తి స్థల్ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పరకాల అమరధామం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా డా. పగడాల కాళీ ప్రసాద్ రావు మాట్లాడుతూ, తెలంగాణ విమోచన కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. వారి త్యాగాలు, పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ పరకాల మున్సిపాలిటీ కౌన్సిలర్లు కుక్కల విజయకుమార్, బెజ్జంకి పూర్ణ చారి, ఆకుల లావణ్య శ్రీధర్, పరకాల సింగల్ విండో సొసైటీ వైస్ చైర్మన్ చందుపట్ల రాజేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కాచం గురు ప్రసాద్, పట్టణ ఉపాధ్యక్షుడు మిడిదొడ్డి నరేష్, పట్టణ ప్రధాన కార్యదర్శులు సంగా పురుషోత్తం, పాలకుర్తి తిరుపతి, బిజెపి పరకాల రూరల్ అధ్యక్షులు కాసగాని రాజు కుమార్ నడి కూడ బిజెపి మండల అధ్యక్షులు ఎరుకల దివాకర్ తదితరులు పాల్గొన్నారు