Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

రైతులకు ఎరువుల బుకింగ్‌పై అవగాహన

Author
Posted By AKSHAYA NEWS
| 18 Sep 2026, 07:22 PM |
రైతులకు ఎరువుల బుకింగ్‌పై అవగాహన

రైతులకు ఎరువుల బుకింగ్‌పై అవగాహన


పరకాల సెప్టెంబర్ 18 (అక్షయ న్యూస్) :

పరకాల మండలంలోని రైతులు ఎరువులను బుక్ చేసుకోవడానికి పలు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి సోమరాతి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు సంబంధిత వ్యవసాయ అధికారులు లేదా అధీకృత ఎరువుల డీలర్ల ద్వారా ఎటువంటి ఛార్జీలు లేకుండా ఉచితంగా ఎరువులను బుక్ చేసుకోవచ్చు.అదేవిధంగా, రైతులు తమకు సమీపంలోని గ్రామ సర్వీస్ సెంటర్ లేదా మీ-సేవ కేంద్రం ద్వారా కూడా ఎరువులను బుక్ చేసుకోవచ్చు. మీ-సేవ ద్వారా బుకింగ్ చేసుకున్నప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన కనీస సేవా రుసుము రూ.10/- చెల్లించాల్సి ఉంటుంది.రైతులు స్వయంగా ఆన్‌లైన్‌లో ఎరువులను బుక్ చేసుకోవాలనుకుంటే, (Framework for Fertilizer Sale) యాప్ ద్వారా కూడా బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది.కావున పరకాల మండలంలోని రైతులందరూ అందుబాటులో ఉన్న ఈ బుకింగ్ సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని, ఎరువులను ముందస్తుగా బుక్ చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి సోమరాతి శ్రీనివాస్ సూచించారు.

ఇవి కూడా చదవండి