Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ప్రైవేట్ లెక్చరర్స్ ఐక్యతకు సరికొత్త క్రీడా వేదిక

Author
Posted By AKSHAYA NEWS
| 19 Sep 2026, 11:56 AM |
ప్రైవేట్ లెక్చరర్స్ ఐక్యతకు సరికొత్త క్రీడా వేదిక

ప్రైవేట్ లెక్చరర్స్ ఐక్యతకు సరికొత్త క్రీడా వేదిక

హన్మకొండ. సెప్టెంబర్ 19 (అక్షయ న్యూస్) :

వరంగల్–హన్మకొండ జంట జిల్లాల్లోని వివిధ ప్రైవేట్ కళాశాలల్లో పనిచేస్తున్న ప్రైవేట్ లెక్చరర్స్ అందరూ ఒకే వేదికపైకి వచ్చి జేఏసీ గా ఏర్పడి, తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా ప్రైవేట్ లెక్చరర్స్ ప్రతిష్టాత్మకంగా క్రికెట్ టోర్నమెంట్ను ఈ ఆదివారం నిర్వహించబోతున్నారు.
ప్రైవేట్ లెక్చరర్స్ కోసం భారీ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్‌లో వివిధ ప్రైవేట్ కళాశాలలకు చెందిన అధ్యాపకుల
తో కూడిన మొత్తం 6 జట్లు పాల్గొంటాయి.

టోర్నమెంట్ నిర్మాణం

గ్రూప్–1: A, B, C జట్లు
గ్రూప్–2: D, E, F జట్లు

ఇవి కూడా చదవండి

గెలుపు కంటే గొప్పది మా లక్ష్యం


ఈ టోర్నమెంట్ నిర్వహణ వెనుక కేవలం క్రికెట్ ఆడాలనే ఆలోచన మాత్రమే లేదు. దీని వెనుక ప్రైవేట్ లెక్చరర్స్ జీవితాలకు సంబంధించిన ఒక గొప్ప సామాజిక లక్ష్యం ఉంది.అరకొర జీతాలతో, రోజుకు దాదాపు 12 గంటలకు పైగా కళాశాలల్లో పనిచేస్తూ, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ప్రైవేట్ లెక్చరర్స్ కీలక పాత్ర పోషిస్తున్నారు.విద్యార్థుల ఫలితాలు, కళాశాల బాధ్యతలు, పని గంటలు, కుటుంబ బాధ్యతలు—ఇలా అనేక కారణాలతో చాలామంది అధ్యాపకులు తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో లెక్చరర్స్‌కు కొంత ఉల్లాసం, మానసిక ప్రశాంతత, స్నేహపూర్వక వాతావరణం అందించాలనే సంకల్పంతో ఈ డబ్ల్యూ పి ఎల్ క్రికెట్ టోర్నమెంట్‌కు శ్రీకారం చుట్టడం జరిగింది.


కళాశాలలు వేరు... లెక్చరర్స్ ఒక్కటే

వరంగల్–హన్మకొండ జంట నగరాల్లో ఎన్నో ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. మనం పనిచేసే సంస్థలు వేరు కావచ్చు... మన కళాశాలల పేర్లు వేరు కావచ్చు... కానీ “మేమంతా లెక్చరర్స్‌గా ఒక్కటే” అనే ఐక్యతా భావాన్ని ఈ టోర్నమెంట్ ప్రతిబింబిస్తుంది.పోటీ మైదానం వరకే...
మైదానం బయట మనమంతా ఒకే కుటుంబం! అని వారు అన్నారు.
ఒకరినొకరు పరిచయం చేసుకోవడం, స్నేహబంధాలను పెంపొందించుకోవడం, పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాల్లో ఒకటి..వరంగల్–హన్మకొండ నుంచి ప్రారంభమవుతున్న ఈ క్రీడా పరంపర భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ లెక్చరర్స్‌ను ఒకే వేదికపైకి తీసుకురావాలన్నది మా సంకల్పం.ఆట కోసం మాత్రమే కాదు...
ఆనందం కోసం, ఆరోగ్యం కోసం, స్నేహం కోసం,ప్రైవేట్ లెక్చరర్స్ ఐక్యత కోసం! అని ప్రైవేట్ లెక్షరర్ల జేఏసీ నాయకులు అన్నారు.